Mon Dec 23 2024 19:23:00 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి రోజా ఫైర్.. అదే జరిగితే?
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి తన పార్టీలోని ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి తన పార్టీలోని ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. వైసీపీ పేరు చెప్పి కొందరు అధికారులను బెదిరిస్తున్నారని రోజా ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అధికారులను బెదిరిస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు.
ఊరుకునేది లేదు.....
ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళతానని రోజా తెలిపారు. పార్టీ పేరు చెప్పుకుని ఎవరైనా వసూళ్లకు పాల్పడినా, అధికారులను బెదిరించినా ఊరుకునే ప్రసక్తి లేదని రోజా తెలిపారు. అటువంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు.
Next Story