Mon Dec 23 2024 19:21:37 GMT+0000 (Coordinated Universal Time)
బాబు పిచ్చి లేచి మాట్లాడుతున్నాడు.. రోజా ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టిన వారు ఎవరూ బాగుపడలేదని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టిన వారు ఎవరూ బాగుపడలేదని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్ ను రాజకీయంగా తొక్కేయాలనుకున్న సోనియా నుంచి శంకర్ రావు వరకూ ఏమయ్యారో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబుకు కూడా అదే గతి పడుతుదని రోజా తెలిపారు. కుప్పం ఓటమి తర్వాత చంద్రబాబుకు పిచ్చిలేచిందని రోజా ఫైర్ అయ్యారు. మానవతప్పిదమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందించారు.
మానవ తప్పిదం అంటే?
మానవతప్పిదం అంటే గోదావరి పుష్కరాల్లో తన షూటింగ్ కోసం పదుల సంఖ్యలో చనిపోయేలా చేసిందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు మానవతప్పిదం ఎలా అవుతుందని రోజా ప్రశ్నించారు. మృతులకు ఎవరికైనా చంద్రబాబు హయాంలో కోటి రూపాయల పరిహారం ఇచ్చారా? అని రోజా ప్రశ్నించారు.
Next Story