Wed Dec 25 2024 13:00:52 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలోనూ ముగ్గురు వైసీపీ అభ్యర్థుల నామినేషన్
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ భాషా, కడప జిల్లాకు చెందిన గోవిందరెడ్డి పేర్లను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా జగన్ ఖరారు చేశారు.
జగన్ ను కలిసి....
ఈరోజు నామినేషన్లకు చివరి గడువు కావడంతో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. మరెవ్వరూ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేదు. దీంతో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు. అంతకు ముందు ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వారికి బీఫారం లను అందజేశారు.
Next Story