Mon Dec 23 2024 13:49:54 GMT+0000 (Coordinated Universal Time)
ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.. అంతా ఒట్టిదే
శ్రీలంక లాంటి సంక్షోభం ఆంధ్రప్రదేశ్ లో రాదని వైసీపీ ఎంపీలు తెలిపారు.
శ్రీలంక లాంటి సంక్షోభం ఆంధ్రప్రదేశ్ లో రాదని వైసీపీ ఎంపీలు తెలిపారు. ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. గత రెండేళ్లుగా కరోనా రావడంతో ఆర్థిక పరిస్థితి దిగజారిన మాట వాస్తవమేనని, అయితే ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా ఏపీ ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. శ్రీలంక మాదరి ఆంధ్రప్రదేశ్ లో సంక్షోభం వస్తుందని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వైసీపీ ఎంపీలు ఖండించారు.
విలువే లేదు...
విపక్షాల విమర్శలకు విలువే లేదన్నారు. కరోనా సమయంలోనే ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిందన్నారు. ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఉపాధి అవకాశాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. శ్రీలంక లాంటి సంక్షోభం ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో రాదని, కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీలు తెలిపారు. ఈ సమావేశంలో మార్గాని భరత్, తలారి రంగయ్య, రెడ్డప్ప, అయోధ్య రామిరెడ్డిలు మాట్లాడారు.
Next Story