Mon Dec 23 2024 14:20:40 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధానికి రఘురామ లేఖ.. ఏపీ ప్రభుత్వంపై?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆయన వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ ఈ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేసిందని, కార్పొరేషన్ల పేరుతో కూడా అప్పలకు తెగబడుతుందని రఘురామ కృష్ణరాజు తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.
అప్పులపై నియంత్రణ....
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాష్ట్రం గ్యారంటీ ఇచ్చే అప్పులు 1.35 లక్షల కోట్లు దాటిందని లేఖలో రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి గుర్తు చేశారు. దీనివల్ల ప్రజలపై భారం పడుతుందని, వెంటనే ఏపీ ప్రభుత్వాన్ని అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని రఘురామకృష్ణరాజు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story