Mon Dec 23 2024 14:17:16 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాను కలిసిన రఘురామ... ఏం చెప్పారంటే?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనతో ఏపీ రాజకీయాల గురించి చర్చించారు. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులతో పాటు, రాజధాని రైతుల మహా పాదయాత్రపై పోలీసులు చేస్తున్న దాడులను రఘురామ కృష్ణరాజు వివరించారు.
రాజధాని రైతుల ఉద్యమం....
దీంతో పాటు తిరుపతి వచ్చినప్పుడు అమరావతి రాజధాని అంశానికి మద్దతివ్వాలని చెప్పడం పట్ల అమిత్ షాకు రఘురామ కృష్ణరాజు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో అమిత్ షా మాట్లాడిన తర్వాతనే జగన్ మూడు రాజధానులపై వెనక్కు తగ్గారని ఆయన అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలను అమిత్ షా కు రఘురామ కృష్ణరాజు వివరించినట్లు తెలిసింది.
Next Story