Fri Jan 03 2025 03:47:32 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఓహో వైసీపీ బ్లాస్టింగ్ న్యూస్ ఇదేనా? పన్నెండు గంటలకే వదిలారుగా?
వైసీపీ తన సోషల్ మీడియాలో బ్లాస్టింగ్ న్యూస్ విడుదల చేసింది.
వైసీపీ తన సోషల్ మీడియాలో బ్లాస్టింగ్ న్యూస్ విడుదల చేసింది. అయితే అది ఏదో అనుకుంటే మరొకటి బయటపడింది. ఒక మీడియా సంస్థకు చెందిన అధిపతి గురించి డ్రగ్స్ దందా ఇదీ అంటూ బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ లిస్ట్ ను కూడా బయటకు వదలింది. నిన్నటి నుంచి వైసీపీ తన ఎక్స్ ఖాతాలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బ్లాస్టింగ్ న్యూస్ విడుదల చేస్తామని ప్రకటించడంతో అందరూ పలు రకాలుగా ఊహాగానాలు చేశారు. ప్రభుత్వంపైన, లేక సంక్షేమ పథకాల అమలుపైన కావచ్చని అంచనాలు వేశారు. లేక ప్రభుత్వంలో ఏదైనా అవినీతిని బయటపెడతారేమోనని అనుకున్నారు.
మీడియా సంస్థ అధినేతకు...
కానీ వైసీపీ సోషల్ మీడియాలో విడుదల చేసిన వివరాల ప్రకారం ఒక మీడియా సంస్థ అధినేతకు సంబంధించి ఫోన్ కాల్స్ లిస్ట్‌ను బయటపెట్టింది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మొత్తం మీద సదరు మీడియా సంస్థకు సంబంధించిన ఫోన్ కాల్స్ లిస్ట్ జాబితాను కూడా వైసీపీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి పదవులు ఇస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన మీడియా అధినేతకు సంబంధించి సాక్ష్యాలివిగో అంటూ బయటపెట్టింది.
బ్లాస్టింగ్ న్యూస్ కాదని....
అయితే ఇదేమీ పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ కాదని, ఇంతకు ముందే కొన్ని పత్రికల్లో ఈ వార్తలు వచ్చాయని టీడీపీ శ్రేణులు కూడా అదే సమయంలో పోస్టింగ్ లు పెడుతున్నారు. దాదాపు 2,500 మందికి ఆయన కాల్స్ చేసినట్లు చూపిన ఆధారాలు కూడా ఫేక్ అంటూ టీడీపీ క్యాడర్ కొట్టిపారేస్తుంది. కావాలనే బురద జల్లే కార్యక్రమం జరుగుతుందని చెబుతున్నారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి బ్లాస్టింగ్ న్యూస్ అని ఎదురు చూస్తున్న క్యాడర్ ఈ న్యూస్ చూసి నిరాశ చెందారు. తాము ఏదేదో ఊహించుకుంటే.. ఏదో జరిగిందని ఇదేమీ కొత్త విషయమేమీ కాదని, దీనికి స్టే ట్యూన్డ్ అంటూ ఊరించడమేంటని కొందరు వైసీపీ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు.
Next Story