Sun Dec 22 2024 20:29:51 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీ ఖాళీ
ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. పన్నెండు మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు
ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. పన్నెండు మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసిన నగర్ మేయర్ సుజాతతో పాటు పన్నెండు మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు.
గత కొద్ది రోజులుగా...
ఒంగోలు కార్పొరేషన్ లో పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు కార్పొరేటర్లు చేరడంతో ఇక కార్పొరేషన్ టీడీపీ పరం కావడానికి ఎంతో దూరం లేదు. గత కొన్నాళ్ల నుంచి దామచర్ల జనార్థన్ తో వైసీపీ కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారు. తమకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తో పాటు తమ పదవులు ఇలాగే కొనసాగించాలని హామీని కోరుతున్నారు.
Next Story