Mon Dec 23 2024 12:45:39 GMT+0000 (Coordinated Universal Time)
జిల్లాల ఏర్పాటు పై ఆనం సీరియస్
వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి జిల్లాల విభజన పై అసహనం వ్యక్తం చేశారు
వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి జిల్లాల విభజన పై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాల విభజన చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. జిల్లాల విభజనతో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలకు అన్యాయం జరుగుతుందని, ఈ మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఆనం రామనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. త్వరలో దీనిపై తాను ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తానని చెప్పారు.
తమ కుటుంబాన్ని....
గతంలో తమ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు నియోజకవర్గాల విభజన చేసిన ఒక నేత అతీగతీ లేకుండా పోయారని ఆనం రామనారాయణరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయిందనన్నారు. గతంలో రాపూరు నియజకవర్గంలో తమ కుటుంబానికి పట్టు ఉందని తెలిసి దానిని తొలగించారన్నారు. జిల్లాల విభజన జరగాల్సిందేనని, అయితే శాస్త్రీయంగా జరగకపోతే ప్రజలకు నష్టం జరుగుతుందని ఆనం రామనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story