Mon Dec 23 2024 06:43:47 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరులో వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళా.. దరఖాస్తు చేసుకోండిలా !
రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఇప్పటికే జాబ్ మేళాలు పూర్తవ్వగా.. తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో
గుంటూరు : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏపీలో ఇటీవల మెగా జాబ్ మేళాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఇప్పటికే జాబ్ మేళాలు పూర్తవ్వగా.. తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎంపి విజయసాయి రెడ్డి తెలిపారు. మే 7,8 తేదీల్లో గుంటూరులో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
గుంటూరులో జరిగే ఈ జాబ్ మేళాలో HCL, HDFC Bank, Hero, Hetero, Apollo Pharmacy, Avani Technology Solutions, Axis Bank, Bharat FIH, Big Basket, Byjus, Cerium Cogent, Dixon తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద తెలిపిన లింక్ ద్వారా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://ysrcpjobmela.com/ ను ఓపెన్ చేయాలి.
Step 2: Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, పార్లమెంట్ నియోజకవర్గం, విద్యార్హత, ఫుల్ అడ్రస్ ను నమోదు చేసి Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
బాపట్ల, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, నర్సారావుపేట, నర్సాపురం, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలుకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతను బట్టి అభ్యర్థులను ఆయా కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి.
Next Story