Mon Dec 23 2024 12:36:59 GMT+0000 (Coordinated Universal Time)
NandigamSuresh: నందిగం సురేష్ ను అక్కడికి తీసుకొచ్చారు
ఈ కేసులో నిందితులుగా పరిగణిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం పై దాడికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ 5 వ తేదీన నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కోర్టురెండు రోజుల పాటు సెప్టెంబర్ 15 నుండి 17 వరకు పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం విచారణా అధికారి మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంకు చేరుకున్నారు. నందిగం సురేష్ ను విచారిస్తున్నారు.
ఇక ఈ కేసులో నిందితులుగా పరిగణిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు లేల్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోగా.. విచారణకు నిందితులు సహకరించలేదని పోలీసులు తెలిపారు. వీరందరినీ పోలీసులు వేర్వేరుగానే విచారించారు.
Next Story