Wed Apr 09 2025 04:00:12 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు వైసీపీ కీలక భేటీ
వైఎస్సార్సీపీ కీలక సమావేశం నేడు జరగనుంది. ఈరోజు జరిగే వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు

వైఎస్సార్సీపీ కీలక సమావేశం నేడు జరగనుంది. ఈరోజు జరిగే వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికట్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పోటీ చేసి ఓటమి పాలయిన అభ్యర్థులందరూ హాజరు కానున్నారు. పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులను మాత్రం ఈ సమావేశం నుంచి మినహాయించారు.
ఓటమి పాలయిన...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంభవించిన దారుణ ఓటమిపై విశ్లేషణల చేయనున్నారు. భవిష్యత్ లో పార్టీని బలోపేతం చేసే విషయంపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయననున్నారు. ఓడిపోయిన అభ్యర్థులనే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జులుగా పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమం ఒక సంకేతాన్ని బయటకు బలంగా పంపాలని నిర్ణయించారు. కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఎలా పనిచేయాలన్న దానిపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story