Mon Dec 23 2024 04:16:46 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు వెళ్లాకే ఆ లెటర్ మాయమైంది
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమామహేశ్వరి మృతి మిస్టరీగా మారిందన్నారు. ఆత్మహత్యకు ముదు ఉమామహేశ్వరి లెటర్ రాసిందని ఆమె చెప్పారు. చంద్రబాబు అక్కడకు వెళ్లిన తర్వాత ఆ లెటర్ మాయమయిందన్నారు.
మిస్టరీ గా ఉంది....
ఉమామహేశ్వరి మృతి వెనక ఏదో ఉందని లక్ష్మీపార్వతి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబానికి శనిలాంటోడని ఆమె విమర్శించారు. ఈ మిస్టరీని బయటకు తీయాల్సిన అవసరం ఉందని, ప్రజలకు తెలియజెప్పాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.
Next Story