Thu Dec 19 2024 19:19:28 GMT+0000 (Coordinated Universal Time)
గాంధీ భవన్ లో టీడీపీ జెండాలపై.. వైసీపీ నేతల సెటైర్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కు అనుకూలంగా చాలా నియోజకవర్గాల్లో పనిచేశాయి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. గాంధీ భవన్ లో టీడీపీ శ్రేణులు పసుపు జెండాలు పట్టుకొని డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఊళ్లో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్లుగా తీరు ఉందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘తెలంగాణలో ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి. ఈరోజు ఫలితం గురించి బాధపడటం లేదు. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందాను. రెండుసార్లు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితాలను ఒక అభ్యాసంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్కు అభినందనలు’ అంటూ కామెంట్స్ చేశారు.
Next Story