Sun Dec 22 2024 21:16:23 GMT+0000 (Coordinated Universal Time)
AP HighCourt: వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు కీలక సూచనలు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 16కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో వైసీపీ నేతలు సజ్జల, తలశిల, దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు పవన్, భాగ్యరాజ్, సుధాకర్ను అరెస్టు చేశారు. వారు ముగ్గురూ కృష్ణలంకకు చెందిన వారు. వారు ముగ్గురు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్రం కార్యాలయంపై 2021, అక్టోబర్ 19న కొందరు దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజీ, టోల్ ప్లాజా వద్ద సేకరించిన సమాచారంతో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించారు. పలువురు వైసీపీ కీలక నేతలపై కేసు నమోదు చేశారు.
Next Story