Sun Dec 22 2024 22:55:12 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి నాని, వంశీలను చంపుతామంటున్నారు
టీడీపీ నేత నారా లోకేష్, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు
టీడీపీ నేత నారా లోకేష్, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని, వంశీలను చంపుతామంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావుపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమే చంద్రబాబు, లోకేష్ లక్ష్యమని.. దమ్ముంటే తండ్రీకొడుకులు గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ చేశారు.
ఇక నారా లోకేష్‌కి పోలీసులు నోటీసులు పంపారు. గన్నవరం సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభలో అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపుతానంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసులు ఇవ్వడానికి వెళ్లారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా కలవనివ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇవ్వాల్సిందేనని పోలీసులు పట్టుబట్టడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నోటీసులు తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని కొనకళ్ల నారాయణ పోలీసులకు హామీ పత్రం ఇచ్చారు.
Next Story