Mon Dec 23 2024 04:44:03 GMT+0000 (Coordinated Universal Time)
"రాజకీయాలు వదిలేస్తా.. నువ్వు రెడీనా లోకేష్" : అనిల్
2024 ఎన్నికల్లో తనపై టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసి గెలిచినా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న అనిల్.. ఛాలెంజ్ మాత్రం లోకేష్..
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పొంగూరు నారాయణను ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ స్పందించారు. తనపై గెలిచేందుకు నారాయణ ఇప్పటి నుంచే రూ.150 కోట్లు రెడీ చేసుకుంటున్నారంటూ సెటైర్ వేశారు. నాలుగున్నరేళ్ల తర్వాత చంద్రబాబు నారాయణను అభ్యర్థిగా ప్రకటించారు. ఒక అభ్యర్థిపై రూ.150 కోట్లు పెట్టారంటే.. ఆ అభ్యర్థి ఎలాంటి వాడు అయ్యుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు లోకేష్ కు తాను విసిరిన సవాల్ పై మాట్లాడుతూ.. తనను 2024లో అసెంబ్లీ అడుగు పెట్టకుండా ఆపే దమ్ము లోకేష్ కు ఉంటే.. తన సవాల్ ను స్వీకరించాలన్నారు. తనను ఆపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనిల్ కుమార్ ఛాలెంజ్ చేశారు.
2024 ఎన్నికల్లో తనపై టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసి గెలిచినా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న అనిల్.. ఛాలెంజ్ మాత్రం లోకేష్ కే విసురుతున్నట్లు చెప్పారు. ఓడిపోతే కాదు.. అసలు తనకు టికెట్ రాకపోయినా రాజకీయాలు వదిలేస్తానన్నారు అనిల్. గెలిచినోడు చెప్తాడు, ఓడినోడు వినాలన్న సామెత ఉంది. తనను అసెంబ్లీకి రాకుండా ఆపగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నువ్వు ఆపలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా ? ఇది ఒక మగాడి ఛాలెంజ్ అని కౌంటర్ ఇచ్చారు. లోకేష్ ఒక పులకేసి, మాలోకం, పెద్ద వెర్రి పుష్పం అని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రను చూసి టీడీపీ నేతలే బాధపడుతున్నారన్నారు.
యువగళాన్ని చూసి టీడీపీ నేతలే ఛీదరించుకుంటున్నారు. గ్రామసింహం తోకపట్టుకుని గోదారి ఈదినట్లేనన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలే మా కర్మ కొద్దీ లోకేష్ వెనుక తిరగాల్సి వస్తుందని బాధపడుతున్నారని విమర్శించారు. రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదవలేకపోయిన లోకేష్.. అంటూ పాదయాత్రలో ఇబ్బంది పడుతూ మాట్లాడిన వీడియోను ప్లే చేసి చూపించారు.పేపర్ చూసి చదవడం తప్పులేదు కానీ.. గాయాలపై కారం చల్లుతున్నారని చెప్పడానికి కూడా తడబడటం ఏంటి? అని ప్రశ్నించారు. రాసిచ్చిన దానిని కూడా సరిగ్గా చదవలేని లోకేష్ కు రాజకీయాలు ఎందుకు అన్నారు.
Next Story