Mon Dec 23 2024 08:20:20 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ కు అసలు బయోడేటా ఉందా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయి కౌంటర్ ఇచ్చారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయి కౌంటర్ ఇచ్చారు. లోకేష్ కు అసలు బయోడేటా ఉందా? అని పిన్నెల్లి ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ లు టీడీపీని దొంగిలించిన విషయాన్ని అందరికీ తెలుసునన్నారు. పిల్ల చేష్టలతో లోకేష్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేలయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇంకోసారి ఇలా చేస్తే....
ఎల్లో మీడియాను వెంట పెట్టుకుని వచ్చి పల్నాడులో ఏదో చేద్దామనుకుంటే కుదరదని పిన్నెల్లి లోకేష్ కు వార్నింగ్ ఇచ్చారు. అక్కడ టీడీపీ నేత బ్రహ్మారెడ్డి హత్యా రాజకీయాలు చేస్తున్నారన్న సంగతి అందిరికీ తెలుసునన్నారు. పల్నాడు ప్రాంతానికి వచ్చినప్పుడు లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. లోకేష్ తనను టార్గెట్ చేసి మాట్లాడారన్నారు. పల్నాడులో తమ కుటుంబానికి ఉన్న పేరును ఒకసారి తెలుసుకోవాలని లోకేష్ కు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Next Story