Thu Dec 26 2024 15:01:32 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లా: వెల్లంపల్లి శ్రీనివాస్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో కొందరికి కావాలనే టికెట్లను ఇవ్వడం లేదనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటీవలే సీఎం జగన్ పలువురు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారు. పలువురు ఎమ్మెల్యేలను జగన్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీటును కూడా జగన్ మార్చబోతున్నారని ప్రచారం సాగుతూ ఉంది.
ఈ తరుణంలో వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ సీటు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. తన గురించి లేనిపోని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను జగన్ సైనికుడినని, వైసీపీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. సీటు మార్పులో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. తన నియోజకవర్గ నిధుల కోసం సీఎంఓ అధికారులను కలవడానికి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లానని వివరించారు వెల్లంపల్లి. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్కు తాను, మేయర్ కలిసి రెండు రోజుల క్రితం వెళ్లామని అన్నారు. సీటు మార్పు గురించి తన వద్ద ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం ప్రస్తావించలేదని తెలిపారు. తాను వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని.. తనను విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమన్నారంటూ ప్రచారం జరుగుతోందని అందులో వాస్తవం లేదన్నారు. జగన్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Next Story