Mon Dec 23 2024 12:35:10 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్, చంద్రబాబులపై విజయసాయి ఘాటు వ్యాఖ్యలు..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం గడువు త్వరలోనే ముగుస్తుందని, అందుకే తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత లోకేష్‌కు ఏ పదవీ వచ్చేది లేదనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
అలాగే నారా చంద్రబాబు నాయుడిపై కూడా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. మద్యం సిండికేట్లకు లైసెన్స్ ఇచ్చిందే చంద్రబాబు అని ఆరోపించారు. "రంగా హంతకులకు వైజాగ్‌ను కానుకగా రాసిచ్చి భూదందాలకు, మద్యం సిండికేట్లకు లైసెన్సిచ్చిందే చంద్రబాబు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రకటనకు ముందే వేల ఎకరాల భూములను కొనిపించింది ఎవరు? ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ఏదో జరుగుతోందంటూ బెదరగొడుతున్నారు తండ్రీ, కొడుకులు." అని దుయ్యబట్టారు.
Next Story