Sun Dec 22 2024 23:21:41 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు నాయుడు అరెస్టు: టపాసులు కాల్చిన వైసీపీ శ్రేణులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు జరగడంపై వైసీపీ శ్రేణులు సంబరాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు జరగడంపై వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఏపీ లోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు బాణాసంచా కాల్చాయి. చిత్తూరు జిల్లా పీలేరులో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. గజ్జల శ్రీనురెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చిన వైసీపీ శ్రేణులు. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాటిలో 109 (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్), 120 బీ (కుట్ర), 166, 167 (క్రిమినల్ నేచర్), 418, 420 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 468 (ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారీ), 471 (అబద్దాలను నిజం చేయడం), 409 (నమ్మక ద్రోహం) ఉన్నాయి. ఇక ఈ అరెస్టుపై టీడీపీ లీగల్ సెల్ న్యాయపోరాటానికి సిద్ధమైంది.
Next Story