Sat Dec 21 2024 14:51:08 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada: ముద్రగడ కోడలికి వైసీపీ తుని టిక్కెట్?
ముద్రగడ పద్మనాభం కోడలు సిరిని తుని నియోజకవర్గం బరిలో దింపాలని వైసీపీ యోచిస్తుంది.
ముద్రగడ పద్మనాభం కోడలు సిరిని తుని నియోజకవర్గం బరిలో దింపాలని వైసీపీ యోచిస్తుంది. ముద్రగడ పద్మనాభం చిన్న కుమారుడు సతీమణి సిరిని తునిలో నిలపాలని వైసీపీ యోచిస్తుంది. తుని నుంచి రెండుసార్లు వరసగా గెలిచిన దాడి శెట్టి రాజా ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనను తుని నియోజకవర్గం నుంచి తప్పించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది.
రాజాను కాకినాడ పార్లమెంటు నుంచి...
అయితే దాడిశెట్టి రాజాను కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సంకేతాలు పంపినట్లు తెలిసింది. అయితే దాడిశెట్టి రాజా తాను పార్లమెంటుకు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దాడి శెట్టి రాజాను కన్విన్స్ చేసేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. తునిలో ముద్రగడ పద్మనాభం కోడలు అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వైసీపీ అధినాయకత్వం నిర్వహించిన సర్వేల్లో వెల్లడయినట్లు సమాచారం. ఈరోజు వైఎస్ జగన్ కాకినాడ పర్యటనలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story