Fri Apr 04 2025 10:55:28 GMT+0000 (Coordinated Universal Time)
రేపు కడపలో జాబ్ మేళా
రేపు కడపలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.

రేపు కడపలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. మూడు చోట్ల జరిపిన జాబ్ మేళాలో 40 వేల మందికి ఉపాధి దొరికిందన్నారు. నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడమే వైసీీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. గత మూడు సంవత్సరాల్లో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు. కడపలో జరిగే జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్లు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
లోకేష్ కు సవాల్ చేసే స్థాయి...
గతంలో ఉద్యోగాలు తీసేసిన చరిత్ర చంద్రబాబుది అని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు అభినవ పులకేశి అని అన్నారు. 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి చంద్రబాబు ఉద్యోగుల కడుపు కొట్టారని ఆయన విమర్శించారు. పరిశ్రమల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జాబ్ మేళాలోనూ సామాజిక న్యాయం పాటిస్తున్నారని అన్నారు. మంత్రిగా పనిచేసి ఎన్నికల్లో ఓటమి పాలయిన లోకేష్ మాటలకు విలువ ఉంటుందా? లోకేష్ కు సవాల్ చేసే స్థాయి లేదన్నారు విజయసాయిరెడ్డి
Next Story