Tue Nov 26 2024 19:44:27 GMT+0000 (Coordinated Universal Time)
దర్శకుడు రవి బాబు వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ దర్శకుడు రవిబాబు వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ దర్శకుడు రవిబాబు వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు కుటుంబం, తమ కుటుంబానికి ఎంతో ఆప్తులని అన్నారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని.. సినిమా వాళ్ల గ్లామర్, రాజకీయ నేతల అధికారం అస్సలు శాశ్వతం కాదన్నారు. చంద్రబాబు ఏదైనా పని అనుకుంటే అన్ని కోణాల్లో ఆలోచించి.. అందరినీ సంప్రదించి ఎవరికీ ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఒకవేళ ఇవాళే చివరి రోజని తెలిసినా.. వచ్చే 50 ఏళ్లు సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారన్నారు. డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని.. ఇలా ఎటువంటి ఆధారం లేకుండా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు.
ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచించే చంద్రబాబు గారు, డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. ఎటువంటి ఆధారం లేకుండా, అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదంటూ రవిబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది టీడీపీ. ఈ వీడియోపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది.
"గోదావరి పుష్కరాలప్పుడు రాజమండ్రిలో అమాయకులు చనిపోయినప్పుడు, రెవెన్యూ అధికారిణి వనజాక్షిపై అన్యాయంగా దాడి చేసినప్పుడు, కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సమావేశాలకు హాజరైన అభాగ్యులు ప్రాణాలు కోల్పోయినప్పుడు స్పందించని ఈ రవిబాబు అవినీతి చేసినందుకు చంద్రబాబును అరెస్ట్ చేస్తే దానిపై స్పందిస్తున్నాడు. ఇతనెంత గొప్ప టీడీపీ ఆర్టిస్టో అర్థమవుతోంది. ఇలాంటి ఆర్టిస్టులని ఎంత మందిని తీసుకొచ్చిన మీ చంద్రబాబు చేసిన స్కిల్ స్కామ్ ఆర్ట్ ని తుడిచివేయలేరు!" అంటూ పోస్టు పెట్టింది వైసీపీ.
Next Story