Mon Dec 23 2024 13:46:10 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎంపీ భార్య, కుమారుడు కిడ్నాప్
రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో..
విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు చందు తో పాటు.. కుటుంబానికి చెందిన సన్నిహితుడు, ఆడిటర్, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ సత్యనారాయణ నగరంలో లేరని సమాచారం.
ఆనందపురంలో ఉన్న కుమారుడి వద్దకు ఎంపీ భార్య వెళ్తున్న సమయంలో కిడ్నాప్ జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి ఆడిటర్ జీవీ అక్కడికి వెళ్లగా.. ఆయనకూడా కిడ్నాప్ అయ్యారని, వారందరినీ ఒకే ఇంట్లో నిర్బంధించినట్లు తెలిసింది. బుధవారం (జూన్14) జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. విషయం మీడియాకు తెలియడంతో స్పందించిన పోలీసులు.. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని, సాయంత్రం కిడ్నాపర్ల వివరాలను వెల్లడిస్తామన్నారు.
Next Story