Wed Jan 08 2025 16:54:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైఎస్సార్సీపీ శాసనసభ సభ పక్ష సమావేశం
వైఎస్సార్సీపీ శాసనసభ సభ పక్ష సమావేశం నేడు జరగనుంది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలుపాల్గొననున్నారు.
వైఎస్సార్సీపీ శాసనసభ సభ పక్ష సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గ విస్తరణపై జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉండనుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
దిశానిర్దేశం....
దీంతో పాటు వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యేలను జగన్ సమాయత్తం చేయనున్నారు. ఇప్పటి వరకూ పాలనపైనే దృష్టి పెట్టిన జగన్ ఇక ఈ రెండేళ్లు పార్టీ విషయాలను కూడా నేరుగా పరిశీలించనున్నారు. వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నం చేయనున్నారు. ఈ రెండేళ్లు పార్టీకి, ప్రభుత్వానికి ఎంత కీలకమో జగన్ ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story