Fri Mar 14 2025 22:13:28 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప జిల్లాలోని ఇడుపులపాయలో పర్యటించనున్నారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప జిల్లాలోని ఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు కుటుంబ సభ్యులతో కలసి ఆమె ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కు చేరుకుంటారు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆమె మధ్యాహ్నం రెండు గంటలకు కడపకు చేరుకుంటారు.
కుమారుడు వివాహం...
అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయ వద్దకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం నిశ్చయం కావడంతో ఆమె అక్కడకు వెళ్లి తండ్రి వైఎస్సార్ ఆశీర్వచనాలు తీసుకోవాలని భావిస్తున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి నివాళులర్పించనున్నారు.
Next Story