Mon Dec 23 2024 11:39:45 GMT+0000 (Coordinated Universal Time)
సంక్షేమ పథకాల అమలులో మేమే ఫస్ట్ : వైవీ
వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందుతున్నాయని రీజనల్ కో - ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందుతున్నాయని రీజనల్ కో - ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు గతంలో కన్నా భిన్నంగా, ఎక్కువగా అర్హులైన వారందరికీ అందించింది ఈ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. చింతపల్లిలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీలు కుంభ రవిబాబు, అప్పిరెడ్డిలతో ఆయన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేరుగా ప్రజల చెంతకే...
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఏపీలోనే అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అంతే స్థాయిలో జరుగుతుందని అననారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చెంతకు చేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, అందుకు ముఖ్యమంత్రి జగన్ పారదర్శక పాలన కారణమని ఆయన తెలిపారు. విద్యారంగంలోనూ నాడు-నేడు కార్యక్రమం అమలు చేసి నూతన ఒరవొడికి శ్రీకారం చుట్టామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story