Thu Dec 26 2024 14:30:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బాబు కీలక సమావేశం
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు జోన్ 2 కీలక సమావేశం జరగనుంది.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు జోన్ 2 కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఏలూరు సమీపంలోని చోదిమెళ్ల వద్ద జరగనుంది. ఒక జోన్ కు 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఐదు పార్లమెంటు స్థానాలను ఉంచారు. రాష్ట్రంలో మొత్తం ఐదు జోన్ లుగా విభజించారు. జోన్ 2 పరిధిలో ఏలూరు, నరసాపురం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి.
నియోజకవర్గాల నేతలకు...
ఈ నియోజకవర్గాలకు చెందిన నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇటీవల ప్రతి 30 కుటుంబాలకు కుటుంబ సాధికార సారధి ప్రక్రియపై కూడా చంద్రబాబు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చంద్రబాబు ప్రస్తావించే అవకాశముంది.
Next Story