Mon Dec 23 2024 06:27:53 GMT+0000 (Coordinated Universal Time)
పాఠశాలలో ఉపాధ్యాయుడి కీచకపర్వం..మూడోసారి సస్పెండ్
బలుసుపాడు జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాము అదే స్కూల్ లో చదువుతున్న విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా..
విద్యార్థులకు పాఠాలు చెబుతూ.. భవిష్యత్ కు దిశా నిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచక అవతారమెత్తాడు. రెండుసార్లు సస్పెండైనా ఆవగింజలో అరభాగమంతా మార్పు రాకపోగా.. మరోసారి విద్యార్థినులను వేధించసాగాడు. ఎన్టీఆర్ జిల్లా (ఉమ్మడి కృష్ణాజిల్లా)లోని జగ్గయ్యపేట బలుసుపాడు జడ్పీ హైస్కూల్లో వెలుగులోకొచ్చిన ఈ ఘటన..స్థానికంగా చర్చనీయాంశమైంది.
బలుసుపాడు జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాము అదే స్కూల్ లో చదువుతున్న విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులతో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ.. వెకిలి చేష్టలు చేస్తున్నాడు. తాకరాని చోట తాకుతూ.. తన కామవాంఛను తీర్చుకునే ప్రయత్నం చేసేవాడు. రాము అరాచకాలను భరించలేని విద్యార్థినులు.. ఉన్నతాధికారులకు అతనిపై ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు అతనిపై విచారణ జరిపి.. సస్పెండ్ చేశారు. గతంలోనూ రాము ఇలాంటి వ్యవహారాల్లోనే రెండు సార్లు సస్పెండయ్యాడు కానీ.. ఇసుమంత మార్పుకూడా రాలేదు. రాము ని కఠినంగా శిక్షించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయుల కొరత కారణంగా బలుసుపడు పాఠశాలలకు రాము డిప్యుటేషన్ పై రావడం గమనార్హం.
Next Story