Sun Dec 22 2024 12:50:54 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections Result : ఆరా మస్తాన్ కు ఇంత మంది ఫోన్ చేశారా? ఆయన ఫోన్ లో మిస్ డ్ కాల్స్ ఎవరివో తెలుసా?
జాతీయ మీడియా సంస్థలను పక్కన పెడితే ఆరా మస్తాన్ కు చెందిన సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలపైనే ఆసక్తి నెలకొంది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జాతీయ మీడియా సంస్థలను పక్కన పెడితే స్థానికంగా క్రెడిబిలిటీ ఉన్న ఆరా మస్తాన్ కు చెందిన సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలపైనే ఆసక్తి నెలకొంది. ఆరా మస్తాన్ ది సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఆయనకు అన్ని పార్టీ నేతలతో సత్సంబంధాలున్నాయి. ఆయన సంస్థ అంచనాలు కరెక్ట్ అవుతాయని అందరూ భావిస్తారు. ఎందుకంటే 2012 ఉప ఎన్నికల నుంచి ఆరా మస్తాన్ అనేది బాహ్య ప్రపంచానికి తెలిసింది. బయట ప్రజలకు తెలియకపోయినా కరెక్టయిన రిజల్ట్ ముందుగా అంచనా వేసి ఇస్తారన్న నమ్మకం నేతల్లో బాగా ఉంది.
ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ కు...
అందుకే ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ కు అంతటి విశ్వాసం ఏర్పడింది. అయితే ఈసారి ఆరా మస్తాన్ ఏపీ ఎన్నికల్లో స్వల్ప సంఖ్య తేడాతో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికలలో వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పారు. పదమూడు నుంచి పథ్నాలుగు లోక్ సభ స్థానాలు వైసీపీకి దక్కే అవకాశముందని తేల్చారు. విపక్ష కూటమికి 71 నుంచి 81 స్థానాలు, పది నుంచి పన్నెండు లోక్ సభ స్థానాలు వస్తాయని ఆయన అంచనా వేశారు. దీంతో పాటు తాను చెప్పింది నిజం కాకపోతే ఇక సర్వేలు చేయనని కూడా ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్పడం విశేషం. అనేక మంది నేతలు ఓడిపోతారని చెప్పారు. మరికొందరు నేతలు గెలుస్తారని కూడా చెప్పారు. అలా ఆయన ఖచ్చితంగా చెప్పడంతో అనేక మంది నేతలు ఆయనకు ఫోన్లు చేసి మరీ ఆరా తీస్తున్నారు.
ఒక యూట్యూబ్ ఛానల్ కు...
ఈ విషయం ఒక ప్రయివేటు యూ ట్యూబ్ ఛానల్ లో ఆయన ఫోన్ లో అందరి మిస్ డ్ కాల్స్ ఉన్నాయి. ఆ మిస్ డ్ కాల్స్ ను పరిశీలిస్తే అన్ని పార్టీలకు చెందిన నేతలున్నారు. అందులో బీజేపీకి చెందిన సీఎం రమేష్, సుజనా చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ మిస్ డ్ కాల్స్ కూడా ఉన్నాయి. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసినట్లు ఆయన ఫోన్ లో కనపడుతుంది. వైసీపీకి చెందిన ప్రముఖ నేతలతో పాటు టీడీపీ నేతల ఫోన్లు కూడా అందులో ఉండటంతో అందరూ టెన్షన్ పడుతున్నట్లే కనిపించింది. అయితే ఈ ఇంటర్వ్యూ లో ఆరా మస్తాన్ మాత్రం తాను వారి ఎవరితోనూ మాట్లాడలేదని, తాను తర్వాత మాట్లాడతానని చెప్పారు. తాను ఎగ్జిట్ పోల్స్ కు ముందు ఎవరికీ రిజల్ట్ వెల్లడించనని కూడా చెప్పారు. మొత్తం మీద ఆరా మస్తాన్ ఫోన్ లో మిస్ డ్ కాల్స్ చూస్తే నేతలు తమ గెలుపుపై ఎంత టెన్షన్ పడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ట్రోల్స్ పై ఏమన్నారంటే...
ఆరా మస్తాన్ తనపై ట్రోల్ అవుతున్న దానికి కూడా వివరణ ఇచ్చారు. తాను పోలింగ్ అయిన తర్వాత ఎవరి ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తున్నానని తెలిపారు. అంతే తప్ప ఎన్నికలకు ముందు ఎలాంటి అంచనాలను తాను విడుదల చేయనని చెప్పారు. అలాంటప్పుడు తనను ప్రలోభపెడితే ఎవరికి లాభమని ఆయన ప్రశ్నించారు. ఆల్రెడీ ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైనందున తాను ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రకటించినా ప్రయోజనం ఉంటుందా? అని ఆయన ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అయితే తన ఎగ్జిట్ పోల్స్ వల్ల కొంత బెట్టింగ్ లు తగ్గాయని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆరా మస్తాన్ తెలిపారు.
Next Story