Ap Elections : మెంటల్ ఎక్కిపోతుంది సామీ..ఓట్ల బదిలీపై టెన్షన్.. ఎందుకిలా అయిపోయింది బాబయ్యా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ జరిగి దాదాపు పక్షం రోజులవుతుంది. మరో ఆరు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ జరిగి దాదాపు పక్షం రోజులవుతుంది. మరో ఆరు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అంచనాలు మాత్రం ఎవరివి వాళ్లవే. ప్రధానంగా కూటమి అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం పీక్ స్థాయిలో ఉంది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే పోలింగ్ జరిగిన తర్వాత కొత్త సందేహాలు మొదలయ్యాయి. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ పది స్థానాలు, మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. 144 స్థానాల్లో జనసేన, బీజేపీ ఓట్లు ఏ మేరకు టీడీపీకి బదిలీ అయ్యాయా? లేదా? అన్నది మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ ఇంజినీరింగ్ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. అభ్యర్థులను బట్టి కూడా ఓటర్లు చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారన్న వార్తలు అందుతున్నాయి.