Sat Nov 16 2024 18:39:28 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏకపక్షంగా దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ.. వెల్ఫేర్ స్కీమ్స్ కు లభించని ఆదరణ
ఆంధ్రప్రదేశ్ లో వన్ సైడ్ పోలింగ్ జరగుతున్నట్లే కనపడుతుంది. ఎక్కడా వైసీపీకి అవకాశం కనిపించడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో వన్ సైడ్ పోలింగ్ జరగుతున్నట్లే కనపడుతుంది. ఎక్కడా వైసీపీకి అవకాశం కనిపించడం లేదు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈవీఎంల ద్వారా బయటపడుతున్నట్లవుతుంది. ఎందుకంటే ఎర్లీ ట్రెండ్స్ లో ఇంత భారీ స్థాయిలో టీడీపీ ఆధిక్యం కొనసాగుతుండటంతో ఇక అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఏ ప్రాంతంలోనూ ఫ్యాన్ పార్టీ ఆధిక్యంలో లేదు. ఎమ్మెల్యే స్థానాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలు కూడా అంతా కూటమి వైపు మొగ్గు చూపారని అనుకోవాల్సి ఉంటుంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలలో ఎక్కడ పట్టినా సైకిల్ వేగంగా పరుగులు తీస్తుంది. బీజేపీ, జనసేన కూడా బలంగా కనిపిస్తున్నాయి. స్టేట్ వైడ్ గా చూస్తుంటే సైకిల్ పార్టీ లీడ్ లో ఉంది. ఏకపక్షంగా ఓటింగ్ కొనసాగుతుంది. గుడివాడలో కొడాలి నాని కూడా వెనుకంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా రాంగ్ అయినట్లే కనిపిస్తున్నాయి. ప్రజల గంపగుత్తగా ప్రజలు కూటమి వైపునకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కడా జగన్ పార్టీకి అవకాశం కనిపించడం లేదు.
ఎర్లీ ట్రెండ్స్ లో...
ఇలా ఎర్లీ ట్రెండ్స్ అనకోవడానికి లేదు. జనం మూడ్ అనేది అర్ధమవుతుంది. జనం కసితో జగన్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఖచ్చితంగా చెప్పాలి. అన్ని జిల్లాల్లోనూ ఎక్కడా వైసీపీకి అనుకూలంగా ఓటు పడలేదు. అంటే మహిళలు అత్యధికంగా టీడీపీ వైపు మొగ్గు చూపారని అనుకోవాలి. ఉద్యోగులు, మహిళలు, పురుషులు ఇలా అన్ని వర్గాల వారూ ఏకపక్షంగా వైసీపీకి వ్యతిరేకంగా నిలబడ్డారన్నది చూడాలి. సంక్షేమ పధకాలు ఏమీ పనిచేయలేదని అంచనా వేసుకోవాలి.
Next Story