Thu Dec 19 2024 11:55:34 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : కొడాలి నానికి ఫస్ట్ టైం చెమటలు పడుతున్నాయా? అందుకు అదే అసలైన కారణమా?
గుడివాడలో కొడాలి నాని తన పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు.
గుడివాడలో కొడాలి నాని తన పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైం గింగరాలు తిరుగుతున్నారు.ఎస్ ఇప్పుడు గుడివాడలో అదే పరిస్థితి కనిపిస్తోంది. 2004లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన కొడాలి నాని గుడివాడను పార్టీలతో సంబంధం లేకుండా తన అడ్డాగా మార్చేసుకున్నారు. నానికి గత నాలుగు ఎన్నికల్లో ఎప్పుడూ ఏదో ఒక లక్ కలిసి వస్తోంది. తొలిసారి పోటీ చేసినప్పుడు క్రేజ్‌తో పాటు క్లీన్ ఇమేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. వైఎస్ వేవ్ తట్టుకుని మరీ గెలిచాడు. ఆ తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ముక్కోణపు పోటీలో అప్పటి మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుపై భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీలోకి వెళ్లి వైసీపీలో కమ్మ నేతగా.. ఓ ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా విన్ అయ్యారు.
ఏడాదిన్నర నుంచే...
ఇక 2019లో అవినాష్ టీడీపీ నుంచి పోటీలో ఉన్నా అక్కడ జనసేన నేత పోటీ నుంచి తప్పుకోవడంతో కాపు ఓట్లు వన్‌సైడ్‌గా దేవినేని బ్రాండ్‌కు యాంటీగా నానికి పోలయ్యి.. అటు వైసీపీ ప్రభంజనంలో గెలిచారు.కట్ చేస్తే ఇప్పుడు నాని మాత్రం గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వెనిగండ్ల రాము నానితో 100 డిగ్రీల వేడి రేంజ్లో చెమటలు కక్కిస్తోన్న పరిస్థితి. ఏడాదిన్నర నుంచే రాము గుడివాడలో వర్క్ స్టార్ట్ చేశారు. ప్రతి ఇంటికి దూసుకుపోయారు. నాని కమ్మ అయితే ఆయన భార్య సుఖద ఎస్సీల్లో బలమైన మాల సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిది ప్రేమ వివాహం. సుఖదతో పాటు ఆమె తండ్రి నియోజకవర్గంలో మాల వర్గ ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని యేడాది నుంచి చాపకింద నీరులా రాజకీయం చేశారు.
మూడు వర్గాల్లో నాని...
చాలా చర్చిలతో కాంటాక్ట్ అయ్యి వాళ్లలో చాలా వరకు మార్పు తీసుకువచ్చారు. ఇటు కొడాలి నాని తొలి మూడేళ్లు పేరుకు మంత్రిగా ఉన్న గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఆయన మార్క్ లేదు. ఎంత వరకు జగన్‌ను పొగుడుతూ చంద్రబాబు, లోకేష్, టీడీపీని తిట్టడంలోనే హైలెట్ అయ్యేందుకు ట్రై చేశారు. కమ్మ వర్గం ఈ సారి నానికి యాంటీగా ఉంది. కాపు వర్గం కూడా నాని పట్ల వ్యతిరేక భావంతో ఉంది. పవన్‌ను నాని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో గత ఎన్నికల్లో నానికి ఓట్లేసిన కాపులు ఈ సారి బాగా యాంటీగా ఉన్నారు. ఇలా ఎస్సీ ఓట్లలో చీలిక, కమ్మ, కాపుల్లో మెజార్టీ యాంటీగా ఉండడంతో నానికి గెలుపు ఏ మాత్రం ఈజీ కాదనే చెప్పాలి.
చివరి నిమిషంలో...
అటు రాము గుడివాడలో చాలా మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో ఆ వర్గాల్లో బాగా దూసుకుపోయారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు పలు కంపెనీలు ఉండడంతో ఆయన రికమెండేషన్ లెటర్‌తో చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్న ప్రచారం బాగా హైలెట్ అవుతుంది. అయితే కొడాలి నానిలా మాస్ ఇమేజ్ లేకపోవడం.. నాని 20 ఏళ్లుగా ఇక్కడ ప్రజలకు బాగా కనెక్ట్ అయిపోవడం రాముకు ఇబ్బందే. కొడాలి నానిని లోకల్ గా చూస్తారు అక్కడి జనం. రామును అవుట్ సైడర్ గానే భావిస్తారు. ఓవరాల్‌గా చూస్తే ఈ సారి గుడివాడలో కొడాలి నాని గెలుపు అయితే అంత ఈజీ కాదు.. ప్రస్తుతానికి హోరాహోరీ పోరులో కొడాలి నానికి స్వల్ప ఆధిక్యం ఉన్నట్టు అనిపిస్తున్నా.. అది ఎన్నికల వరకు నిలబడుతుందా ? లేదా ? అంటే పోల్ మేనేజ్మెంట్లో పై చేయి సాధించిన వాడే గుడివాడ కింగ్ అవుతాడు అనడంలో సందేహం లేదు
Next Story