Mon Nov 18 2024 04:34:54 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections Counting : ఎగ్జిట్ పోల్స్లో చెప్పింది రివర్స్ అయిందిగా... ఆరా అంచనా తప్పిందిగా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వన్ సైడ్ మెజారిటీ లభిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా నాడి అందలేదు.
ఆరా చెప్పింది ఇదే...
ఈ ఎన్నికలలో వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పారు. పదమూడు నుంచి పథ్నాలుగు లోక్ సభ స్థానాలు వైసీపీకి దక్కే అవకాశముందని తేల్చారు. విపక్ష కూటమికి 71 నుంచి 81 స్థానాలు, పది నుంచి పన్నెండు లోక్ సభ స్థానాలు వస్తాయని ఆయన అంచనా వేశారు. ఓట్ల శాతం రెండు మాత్రమే ఇద్దరి మధ్యఉంటుందనిచెప్పారు. అయినా వైసీపీదే విజయం అని చెప్పారు. ఆరా మస్తాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఈ లెక్కలు చూసి వైసీపీ అభిమానులు కౌంటింగ్ కు ముందే సంబరాలు చేసుకున్నారు. ఈవీఎంలు తెరవకముందే తాము గెలిచినట్లు ఫీలయిపోయి ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమయ్యారు.
మై యాక్సిస్ సంస్థ...
ఇలాంటి పరిస్థితుల్లో ఆరా మస్తాన్ అంచనా తప్పింది. అలాగే మరో విశ్వసనీయమైన సంస్థ మై యాక్సిస్ సంస్థ జరిపిన సర్వే నిజమైందని చెప్పాలి. మై యాక్సిస్ అత్యధిక పార్లమెంటు స్థానాలను కూటమి సాధిస్తుందని చెప్పారు. ప్రదీప్ గుప్తా ఇక్కడ నిర్వహించిన సర్వేలను బయటపెట్టడంతో ఎవరూ నమ్మలేదు. పోలింగ్ శాతం ఎక్కువగా జరగడం ప్రతిపక్ష కూటమికి లాభం జరుగుతుందని ఆయన వేసిన అంచనా నిజమయింది. అధికార కూటమికి మాత్రం ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఒక గుణపాఠంగా చెప్పాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజం కావు. అలాగని కొన్ని విశ్వసనీయత సంస్థలు ఇచ్చిన అంకెలను కొట్టిపారేయలేం అన్నది మరోసారి రుజువయింది.
Next Story