Mon Dec 23 2024 07:15:00 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : కేసీఆర్ మ్యానిఫేస్టో కూడా ఇలాగే ఉందిగా.. వైసీపీ మ్యానిఫేస్టోపై సెటైర్లు
జగన్ మ్యానిఫేస్టోకు గతఏడాది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విడుదుల చేసిన మ్యానిఫేస్టోకు పోలిక పెడుతూ పోస్టులు పెడుతున్నా
వైసీపీ అధినేత జగన్ విడుదల చేసిన మ్యానిఫేస్టోకు గతఏడాది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విడుదుల చేసిన మ్యానిఫేస్టోకు పోలిక పెడుతూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు లబ్దిదారులంతా తనవెనక ఉంటారని కేసీఆర్ భావించి మ్యానిఫేస్టోను లైట్ గా తీసుకున్నారని, తర్వాత జరిగిన ఫలితాలో ఏమిటో అందరికీ తెలుసునని అంటూ నెట్టింట్ టీడీపీ నేతలు పోస్టింగ్ లు పెడుతున్నారు. కేసీఆర్ కు పట్టిన పరిస్థితి జగన్ కు కూడా పడుతుందన్న కామెంట్ప్ వినపడుతున్నాయి. తాను ఒక్కడే విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
వాస్తవానికి కూడా జనం ఇనిస్టిటెంట్ ప్రయోజనాలు కోరుకుంటారు. వారికి ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్కటే. తమకు మేలుచేసే పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు. అందులోనూ ఒక్కసారి తమకు, తమ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే పార్టీ పక్షానే నిలబడతారు. తెలంగాణలోనూ కేసీఆర్ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే కొత్త పథకాలను ఏవీ ప్రకటించలేదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని, ఆరు గ్యారంటీలతో ముందుకు రావడంతో ఆపార్టీని నమ్మి జనం దానికి ఓటు వేసిన విషయాన్ని కొందరు ఈ సందర్భంగా పదే పదే ప్రస్తావిస్తుండటం విశేషం.
గ్యారంటీల పేరుతో...
చంద్రబాబు కూడా గ్యారంటీల పేరుతో జనం ముందుకు వస్తున్నప్పటికీ, జగన్ మాత్రం పింఛను, రుణ మాఫీ విషయంలో పట్టుబట్టి కూర్చోవడాన్ని ఆపార్టీ అభిమానులు తప్పుపడుతున్నారు. తన సంక్షేమ పథకాలపై అంత నమ్మకంతో జగన్ ఉండటం మూలంగానే సీనియర్ నేతల మాటను కూడా పెడచెవిన పెట్టారంటున్నారు. కేసీఆర్ కూడా ఎవరి మాట వినకుండా తాను అనుకున్న మ్యానిఫేస్టోను మాత్రమే అమలు చేశారు. ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో మ్యానిఫేస్టోను విడుదల చేయడం చూస్తే తెలంగాణ లో వచ్చిన ఫలితాలు ఇక్కడ రిపీట్ అవుతాయోమోనన్న ఆందోళన వైసీపీ అభిమానుల్లోనూ,క్యాడర్ లోనూ ఉంది. మరి ఎన్నికల్లో జనం ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Next Story