Mon Dec 23 2024 17:54:04 GMT+0000 (Coordinated Universal Time)
Narnedra Modi : పెద్దిరెడ్డికి పక్కా ట్రీట్ మెంట్ ఇస్తామన్న నరేంద్ర మోదీ
వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీలేరులో నియోజకవర్గంలో సభలో ఆయన ప్రసంగించారు
వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీలేరులో నియోజకవర్గంలో కలికిరిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కావడం ఖాయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే మోడీ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆయన పిలుపు నిచ్చారు. పుంగనూరులో ఐదేళ్లుగా రౌడీరాజ్యం నడుస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్ మెంట్ ఇస్తామని తెలిపారు. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని.
రాయలసీమలో...
వైసీపీ హయాంలోనే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందన్న మోదీ రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు లేవని, యువత ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏమీ లేదని నరేంద్ర మోదీ అన్నారు. రాయలసీమలోచైతన్య వంతులైన యువత ఉన్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
ఐదేళ్ల కాలంలో...
అన్ని గ్రామాలకు రక్షిత తాగునీరు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ 370 ఆర్టికల్ ను మళ్లీ తీసుకువస్తామని చెబుతుందని, తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనలతోనే కాంగ్రెస్ నేతలున్నారన్నారు. అధికారం కోసంఆ పార్టీ దేశాన్ని విభించాలని అనుకుంటుందోని అన్నారు. దక్షిణాదిలోనూ తాము బుల్లెట్ ట్రైయిన్ ను ప్రవేశెపెడతామని తెలిపారు. నంద్యాల - ఎర్రకుంట రైల్వే లైను పనులు పూర్తయ్యాయని, కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉందని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాలను మరింత కల్పించి సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతుల జీవితాలను కూడా తమ ప్రభుత్వమే మారుస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టను కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు.
Next Story