Mon Dec 23 2024 09:27:11 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఎగ్జిట్ పోల్స్ లో నిజమెంత? క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందా?
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో వాస్తవం ఎంత ఉంది అని చెప్పే కంటే జనం మూడ్ మాత్రం ఎలా ఉంది అని చెప్పగలిగే అవకాశముంది. ఈసారి 2024 ఎన్నికల్లో ఎక్కువ సంస్థలు వైసీపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. అయితే గతంలో వచ్చిన సీట్లు కంటే కొంత తగ్గాయి. అధికార పార్టీకి కొంత సీట్లు తగ్గగా, విపక్ష పార్టీల సీట్ల సంఖ్య పెంచుకోగలిగింది. అయితే ఇవి ఎగ్జాట్ అంచనాలు అన్నది పక్కన పెడితే పోలింగ్ రోజు జనం నాడి ఎలా ఉందన్నది తెలుసుకోవచ్చు. శాస్త్రీయంగా సర్వేలు ఎంత మేరకు చేశారని పక్కన పెడితే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు మనోభావాలలో కొంత మేరకు ప్రతిబింబించే అవకాశాలున్నాయి. గాలి ఎటు వైపు ఉందన్నది మాత్రం కొంత వరకూ చెప్పే అవకాశముంది.
నేటి ఎగ్జిట్ పోల్స్ లో...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా సంస్థలు వైసీపీదే అధికారం వైపు మొగ్గు చూపాయి. ప్రముఖ సంస్థలన్నీ వైసీపీదే అధికారంలోకి వస్తాయని మొగ్గు చూపాయి. ఆరా సంస్థ వైసీపీ వైపు నిలబడింది. అయితే ఏబీసీ - సీఓటరు సర్వే మాత్రం శానసనభ ఎన్నికల్లో వైసీపీకి అధిక స్థానాలు ఇవ్వగా, లోక్సభ స్థానాలు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ లో వస్తాయని చెప్పింది. దీన్ని బట్టి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న విశ్లేషణలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడవుతున్నాయి. సంక్షేమ పథకాలు బాగా పనిచేయడం వల్ల, జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ తమకు నగదు బ్యాంకులో పడుతుందని ఎక్కువ శాతం మంది మహిళలు ఫ్యాన్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగ సమస్య వంటి కారణాలు పురుష ఓటర్లను ఆ పార్టీకి దూరం చేశాయి. అయితే మహిళ ఓటర్లు ఎక్కువ మంది పోలింగ్ లో పాల్గొనడటంతో ఎడ్జ్ వైసీపీ వైపే ఉందని అధిక సంస్థలు తేల్చాయి.
2019 ఎన్నికల్లో....
2019 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సంస్థలు కొంత దగ్గరగా ఫలితాలు చెప్పగలిగాయి. 2019 ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్... ఎగ్జాట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇండియా టుడే వైసీపీకి 130 నుంచి 135 స్థానాలు వస్తాయని చెప్పింది. టీడీపీకి 37 నుంచి నలభై స్థానాలు దక్కే అవకాశముందని తెలిపింది. సీపీఎస్ సంస్థ వైసీపీకి 130 నుంచి 133 స్థానాలు వస్తాయని తెలిపింది. టీడీపీ 43 నుంచి 44 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. వీడీపీ అసోసియేట్స్ వైసీపీకి 111 నుంచి 121 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ 54 నుంచి 60 స్థానాలు వస్తాయని తెలిపింది. ఆరా మస్తాన్ సంస్థ వైసీపీకి 119 నుంచి 126 స్థానాలు వస్తాయని చెబితే, టీడీపీకి 47 నుంచి 56 స్థానాలు వస్తాయని తెలిపింది. అయితే 2019 ఎన్నికల్లో తుది ఫలితాలు మాత్రం వైసీపీకి 151 స్థానాలు వస్తే టీడీపీ 23 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. అంటే నాడు కూడా వైసీపీ గెలుస్తుందని అన్ని సంస్థలు అంచనాలు వేసినా అంకెలు మాత్రం కొంత ఎక్కువగా అసలు ఫలితాల్లో వెల్లడయ్యాయి.
Next Story