Sat Dec 21 2024 07:59:13 GMT+0000 (Coordinated Universal Time)
NDA Manifesto : టీడీపీ మ్యానిఫేస్టో అదుర్స్.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ మ్యానిఫేస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు
ఎన్డీఏ మ్యానిఫేస్టో ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 18 నుంచి 59 ఏళ్ల ఉన్న మహిళలకు 1,500 రూపాయలు పింఛణు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు మూకడు వేల రూపాయల భృతిని అందచేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని తెలిపారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని తెలిపారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పారు.
ఉచిత ప్రయాణం..
దీపం పథకం కింద మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందచేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందచేస్తామని తెలిపారు. పింఛను నాలుగు వేల రూపాయలు అందచేస్తామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఏటా అందచేస్తామని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనను పంపుతామని చెప్పారు. మత్స్యకారులకు ఏటా ఇరవై వేల రూపాయలు అందచేస్తామని చెప్పారు. చెత్త పన్ను రద్దు చేస్తామని తెలిపారు. మద్యం ధరలను నియంత్రించడమే కాకుండా విషపూరిత బ్రాండ్లను కాకుండా నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు. అన్నా క్యాంటిన్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆదరరణ కింద...
ఆదరణ కింద బీసీల అభివృద్ధి కోసం ఐదు వేల కోట్ల రూపాయలు అందచేస్తామని తెలిపారు. కన్యాకపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎయిడెడ్ కళాశాలలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. బీసీల స్వయం ఉపాధి కోసం ఏటా పది వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. పవర్ లూమ్స్ కు రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందిస్తామని తెలిపారు. కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని తెలిపారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తామని తెలిపారు.
20 లక్షల ఉద్యోగాలు...
యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. బీసీలకు యాభై ఏళ్లకే పింఛను వచ్చేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆధునిక పనిముట్లతో ఆదరణ ను అమలు చేస్తామని చెప్పారు. డాక్వా మహిళలకు పది లక్షల వరకూ వడ్డీ లేని రుణాలను అందిస్తామని తెలిపారు. ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రెండు వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందచేస్తామని చంద్రబాబు తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకు వస్తామని తెలిపారు.పూర్తి దివ్యాంగులకు పదివేల రూపాయల పింఛను ఇస్తామని తెలిపారు.
Next Story