Sun Dec 22 2024 21:56:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ కు రెండేళ్ల వరకూ బేఫికర్.. భయపడాల్సిన పనేలేదట బాసూ
వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు
వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు. లోక్సభలో కేవలం నలుగురు సభ్యులే ఉండనునున్నారు. తిరుపతి, రాజంపేట, అరకు, కడప నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఆయనపై ఉన్నకేసులతో ఇబ్బంది పడే అవకాశాలున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉండటంతో కేసులపై మోదీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కొంతలో కొంత జగన్ కు ఊరటనిచ్చే అంశం కూడా మరొక కోణంలో చూస్తే కనపడుతుంది.
అరకొర మెజారిటీతో...
బీజేపీ ఇప్పుడు అరకొర మెజారిటీతో గట్టెక్కింది. కేవలం 240 స్థానాలకే పరిమితమయింది. మిత్రపక్షాల అవసరం ఎంత అవసరమో.. బయట నుంచి మద్దతిచ్చే పార్టీల అవసరం కూడా అంతే ఉంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ఓడించి అక్కడ బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు, నవీన్ పట్నాయక్ పై ప్రచారంలో మోదీ వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయన వైపు నుంచి మద్దతు దొరికేది కష్టమేనని చెబుతున్నారు. ఇక ఇతర పార్టీల పై ఆధారపడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల అవసరం మోదీ ప్రభుత్వానికి ఎంతో ఉంది. అందులోనూ వైసీపీ రాజ్యసభలో ఎక్కువ స్థానాలున్నాయి. టీడీపీకి ఒక్క స్థానం కూడా పెద్దలసభలో లేకపోవడంతో వైసీపీ కీలకంగా మారనుంది.
మరో రెండేళ్లు...
వైసీపీకి ఇప్పుడు రాజ్యసభలో పదకొండు మంది రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో జగన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు ఎదురయ్యే ప్రమాదం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. 2026 జూన్ నెలకు నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. జూన్ 21వ తేదీకి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ పదవీ కాలం పూర్తవుతుంది. జూన్ 2026 నాటికి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలన్నీ కూటమి ఖాతాల్లోనే పడతాయి. ఒక్క 2026 మాత్రమే కాదు మళ్లీ 2029 ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఏర్పడే ప్రతి ఒక్క రాజ్యసభ స్థానం కూటమి ఖాతాలోనే పడుతుంది.
టీడీపీకి నిల్...
జూన్ 2028 నాటికి వైసీపీకి చెందిన మరో నాలుగు రాజ్యసభపదవులు ఖాళీ అవుతాయి. జూన్ 21 2028 నాటికి బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. మిగిలిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 1 30 వతేదీ వరకూ ఉంటుంది. అంటే 2021 తర్వాత కూడా ఏడుగురు రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉంటారు. ఒకరకంగా ఇది జగన్ కు షీల్డ్ అనే చెప్పాలి. తనపైకి దూకుడు తనాన్ని ప్రదర్శించేందుకు రాజ్యసభ స్థానాలను అడ్డుపెట్టుకునే వీలుంది. ఎందుకంటే టీడీపీకి రాజ్యసభలో ఒక్క స్థానం కూడా లేకపోవడంతో పెద్దల సభలో జగన్ సహకారం మోదీకి అవసరంగా మారడంతో కొన్ని ఇబ్బందులను తప్పించుకునే వీలుందని వైసీపీ నేతలు కొంత వరకూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
Next Story