Sat Jan 11 2025 03:08:33 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మ్యానిఫేస్టో విడుదల తర్వాత తొలిసారి తాడిపత్రిలో జగన్ ఏమన్నారంటే?
ఈ ఎన్నికల్లో ఓటేస్తే జగన్ కు ఓటేస్తే పథకాలను కొనసాగింపు అని, చంద్రబాబుకు ఓటేస్తే ముగింపు అని అన్నారు.
ఈ ఎన్నికల్లో ఓటేస్తే జగన్ కు ఓటేస్తే పథకాలను కొనసాగింపు అని, చంద్రబాబుకు ఓటేస్తే ముగింపు అని అన్నారు. తాడపత్రి నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడారు. చంద్రబాబు ను నమ్మడం అంటే పులినోట్లో తలకాయపెట్టినట్లేనని అన్నారు. చంద్రబాబు మ్యానిఫేస్టో విడుదలకు సిద్ధమవుతున్నారని, ఆయన మాయమాటలకు పడిపోవద్దని అన్నారు. తనకు ఏ జెండాతో పొత్తులు లేవని, జనాలకు మంచి చేసిన నమ్మకమని అన్నారు. మ్యానిఫేస్టోలో 99 శాతం అమలు చేశామని అన్నారు. మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దీవెనలను కోరుతున్నాడని జగన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా బటన్ నొక్కి 2.75 లక్షల కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు.
అలివికాని హామీలతో...
చంద్రబాబు అలివి కానీ హామీలతో మీ ముందుకు ఖచ్చితంగా వస్తాడని, వాటిని నమ్మితే నట్టేట మునిగినట్లేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2.31 లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత మీ ప్రభుత్వ హయాంలోనేనని అన్నారు. ఇంటివద్దకే పథకాలను డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా మీ బిడ్డ హయాంలోనే జరిగిందన్నారు. పేద పిల్లలు చదువుకునే బడులు బాగుపడ్డాయని అన్నారు. ఆసుపత్రులు మెరుగుపడ్డాయని తెలిపారు. గ్రామాలకు వచ్చి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. రైతులకు అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాలను గ్రామాలలోనే ఏర్పాటు చేసి వారికి అండగా నిలిచామని తెలిపారు. గ్రామాలన్నీ ఈరోజు ఎంత అభివృద్ధి చెందాయో? ఎన్ని మార్పులు వచ్చాయో? మీకు తెలుసునని అన్నారు.
చంద్రబాబు పేరు చెబితే...
ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇంటివద్దకే వస్తున్నాయని అన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అని జగన్ ప్రశ్నించారు. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రభుత్వం నుంచి వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా? అని అన్నారు. చంద్రబాబు మోసాలతో మీ ముందుకు వస్తున్నాడన్నారు. పొత్తులు, మేనేజ్ మెంట్లతో మీ ముందుకు వస్తున్నాడన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్కమంచి పనైనా చేశాడా? అని ప్రశ్నించారు. అబద్దాలతో, మోసాలతో మనం యుద్ధం చేస్తానని అన్నారు. చంద్రబాబు 2014 లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. మరి బాబును నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా పెద్దారెడ్డిని మరొకసారి గెలిపించాలని, ఎంపీగా శంకరనారాయణను గెలిపించాలని కోరారు.
Next Story