Sat Dec 21 2024 13:49:00 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. మ్యాచ్ ని టీవీలో, ఆన్లైన్లో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు..!
ఆదివారం జరగనున్న ఆసియా కప్-2022 మ్యాచ్‌పై అందరి దృష్టి ఉంది.
ఆదివారం జరగనున్న ఆసియా కప్-2022 మ్యాచ్‌పై అందరి దృష్టి ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న భారత్, బాబర్ ఆజం కెప్టెన్ గా ఉన్న పాకిస్థాన్ తో తలపడనుంది. గత సంవత్సరం T20 ప్రపంచ కప్- 2021 సందర్భంగా దుబాయ్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు భారత్ పై 10 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. ఆసియా కప్‌లో మాత్రం పాక్ పై భారత్‌దే పైచేయి. 2018లో, మెన్ ఇన్ బ్లూ పాక్ పై రెండు సార్లు గెలిచింది. పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లలో భారత్ పై మూడు వికెట్లు మాత్రమే తీయగలిగింది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 నుండి ఆసియా కప్‌లో ఆడలేదు. రాబోయే మ్యాచ్ అతని ఫామ్ కి చాలా కీలకం. 2012లో కోహ్లీ అజేయంగా 78 పరుగులతో టాప్ స్కోర్ సాధించాడు. టీ20ల్లో పాకిస్థాన్‌పై కోహ్లి సగటు 75కి మించి ఉన్నాడు. నిజాకత్ ఖాన్ సారథ్యంలోని హాంకాంగ్‌తో పాటు భారత్, పాకిస్థాన్ లు గ్రూప్ ఎలో ఉన్నాయి.
ఆసియా కప్-2022లో భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఆసియా కప్ 2022 మ్యాచ్ నం.2 భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
భారత్ లో భారత్-పాక్ మధ్య జరిగే ఆసియా కప్ 2022 మ్యాచ్ 2ని ఎక్కడ చూడగలను?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్-పాక్ మధ్య జరిగే ఆసియా కప్ 2022 మ్యాచ్ నెం.2 ప్రసారం చేయబడుతుంది. హాట్‌స్టార్‌లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
News Summary - Asia Cup 2022 India vs Pakistan When and where to watch Match 2 on TV
Next Story