Mon Dec 23 2024 11:10:51 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకొద్ది గంటల్లో ఆసియా కప్ ఆరంభం.. లైవ్ టెలీకాస్ట్ చూడాలంటే..!
ఆఫ్ఘన్ జట్టులో రషీద్ ఖాన్.. లంక జట్టులో వనిందు హసరంగా వంటి మ్యాచ్ విన్నర్లు ఉండడంతో మ్యాచ్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంకొద్ది గంటల్లో ఆసియా కప్-2022 మొదలు కాబోతోంది. ఆసియా కప్ లో మొదటి మ్యాచ్ లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లూ అండర్ డాగ్స్గా టోర్నమెంట్లోకి అడుగుపెడుతున్నాయి. విజయంతో తమ మొదటి మ్యాచ్ ను ప్రారంభించాలని రెండు జట్లు ఆశిస్తున్నాయి.
ఐదుసార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయిన శ్రీలంక పై ఇటీవలి కాలంలో కాస్త అంచనాలు తక్కువయ్యాయి. పలువురు టీ20 స్టార్స్ దూరమవ్వడంతో లంక జట్టు ను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ దూకుడుగా ఆడుతుండడమే కాకుండా.. ఇటీవలి కాలంలో వరుసగా టీ20 సిరీస్ లను ఆడింది. జింబాబ్వే, ఐర్లాండ్లతో వరుసగా T20I సిరీస్లను ఆడింది. ఆఫ్ఘన్ జట్టులో రషీద్ ఖాన్.. లంక జట్టులో వనిందు హసరంగా వంటి మ్యాచ్ విన్నర్లు ఉండడంతో మ్యాచ్ కూడా ఆద్యంతం రసవత్తరంగా సాగవచ్చని అభిమానులు భావిస్తూ ఉన్నారు. టోర్నమెంట్ చరిత్రలో శ్రీలంక రెండవ అత్యంత విజయవంతమైన జట్టు. వారు చివరి సారిగా 2014లో విజయాన్ని అందుకున్నారు.
ఇరు జట్ల వివరాలు:
ఆఫ్ఘనిస్తాన్: మహ్మద్ నబీ (సి), నజీబుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్హాక్ ఫరూఖీ, హష్మతుల్లా షాహిదీ, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జద్రాన్, కరీంబుల్ నవ్హుల్ హక్వీన్, ముజీబ్ జానాత్, ముజీబ్ నవీన్ హక్వీన్, , రహ్మానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్, సమీవుల్లా షిన్వారీ. స్టాండ్బై: నిజత్ మసూద్, కైస్ అహ్మద్, షరాఫుద్దీన్ అష్రఫ్.
శ్రీలంక: దసున్ షనక (సి), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, అషెన్ బండార, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, ప్రవీణ్ కరుణరత్న, చమీక జయవిక్రమ, చమీక జయవిక్రమ, , నువానీడు ఫెర్నాండో, నువాన్ తుసార, దినేష్ చండిమాల్.
T20I లలో SL vs AFG హెడ్ టు హెడ్
ఆడినది- 01 | శ్రీలంక- 01 | ఆఫ్ఘనిస్తాన్- 0 | ఫలితం లేదు – 0 |
SL vs AFG మ్యాచ్ ప్రసారం: 7:30 PM IST
లైవ్ స్ట్రీమింగ్ - స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్
News Summary - asia cup 2022 SL vs AFG match Live Streaming Details
Next Story