Mon Dec 23 2024 00:09:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడే ఫైనల్స్... లంతో పాక్ ఢీ
నేడు ఆసియా కప్ ఫైనల్ పోటీ జరుగుతుంది. పాకిస్థాన్, శ్రీలంకల మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది
నేడు ఆసియా కప్ ఫైనల్ పోటీ జరుగుతుంది. పాకిస్థాన్, శ్రీలంకల మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది. ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగా ఉండటంతో ఈసారి ఆసియా కప్ ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. భారత్ తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలయినా తర్వాత పుంజుకుంది. అన్ని మ్యాచ్ లలో గెలిచి ఆ జట్టులో పూర్తి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మహ్మద్ రిజ్వాన్ ఈ ఆసియా కప్ లో అత్యధిక పరుగులు సాధించారు. అన్ని మ్యాచ్ లలోనూ విజయానికి కారణమయ్యారు.
ఇరు జట్లు....
శ్రీలంక జట్టును కూడా తీసిపారేయడానికి వీలులేదు. ఆప్ఘనిస్థాన్ జట్టు తో ఓటమి తర్వాత లంక జట్టు బలంగా తయారైంది. బ్యాటింగ్ లైనప్ కూడా బాగా ఉంది. కుశాల్ మెండీస్, రాజపక్స, నిశాంకలు బ్యాటింగ్ లో మెరుగైన ప్రతిభను కనపరుస్తున్నారు. ఇరు జట్లు బలంగా ఓటమి పాలు కావడం, తిరిగి కోలుకోవడంత వ్యూహాలతో బరిలోకి దిగనున్నాయి. మరి చూడాలి చివరకు ఆసియా కప్ ఎవరిని వరిస్తుందనేది.
Next Story