Mon Nov 18 2024 01:40:16 GMT+0000 (Coordinated Universal Time)
కోలుకున్న ద్రావిడ్.. టీమిండియాతో చేరాడు..!
ఆసియా కప్ కోసం UAEకి జట్టు బయలుదేరే ముందు నిర్వహించిన కరోనా పరీక్షలో
భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్ -19 నుండి కోలుకున్నారు. తాజాగా చేసిన పరీక్షలో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆసియా కప్‌లో పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు భారత జట్టులో చేరాడు. 49 ఏళ్ల ద్రవిడ్ ఆగస్టు 28న భారత్ తమ చిరకాల ప్రత్యర్థితో తలపడబోయే మ్యాచ్‌లో టీమిండియా డగౌట్లో ఉంటాడని స్పోర్ట్స్ టుడే నివేదించింది. రాహుల్ ద్రావిడ్ ఆగస్టు 27 సాయంత్రం దుబాయ్‌లో అడుగుపెట్టాడు.
ద్రవిడ్ ఆరోగ్యంపై బీసీసీఐ వైద్య బృందం ఇచ్చిన తాజా నివేదికలో ద్రావిడ్ కు కోవిడ్ -19 నెగటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ద్రావిడ్ దుబాయ్ చేరుకున్నాడు. ఆగస్టు 27న భారత్ ప్రాక్టీస్ సెషన్‌కు కూడా అతను హాజరయ్యాడు. ద్రవిడ్ గైర్హాజరీ కారణంగా తాత్కాలిక కోచ్‌గా ఎంపికైన VVS లక్ష్మణ్ కూడా జట్టుతోనే ఉన్నారు. పాకిస్థాన్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్ సమయానికి లక్ష్మణ్ కూడా అక్కడే ఉంటాడని, ఆ తర్వాత అతను వెనక్కి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆసియా కప్ కోసం UAEకి జట్టు బయలుదేరే ముందు నిర్వహించిన కరోనా పరీక్షలో ద్రవిడ్ కి పాజిటివ్ వచ్చినట్లు ఆగస్టు 23న BCCI ప్రకటించింది. ఆ తర్వాత ద్రావిడ్ BCCI వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నాడు. ఒక రోజు తర్వాత, భారత క్రికెట్ బోర్డు NCA చీఫ్ లక్ష్మణ్‌ను టీమ్ ఇండియా తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమించింది. లక్ష్మణ్ గతంలో జింబాబ్వేలో జరిగిన వన్డే సిరీస్ కోసం భారత జట్టుతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. హరారే నుండి వైస్ కెప్టెన్ KL రాహుల్, దీపక్ హుడా, అవేష్ ఖాన్‌లతో పాటు దుబాయ్‌లోని భారత బృందంతో కలిశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి కూడా ఇది ఎంతో స్పెషల్. పాకిస్థాన్‌తో మ్యాచ్ కోహ్లీకి 100వ టీ20గా రికార్డు అవుతుంది.
Next Story