Sat Nov 23 2024 01:58:14 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హాంగ్ కాంగ్.. భారత జట్టులో ఎవరిని తప్పించారంటే
భారత జట్టులో ఎవరిని తప్పించారంటే
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు హాంగ్ కాంగ్ జట్టుతో భారత్ తలపడనుంది. హాంకాంగ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో హాంగ్ కాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ మాట్లాడుతూ.. టాస్ గెలవగానే బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. గతంలో తాము ఛేజింగ్ బాగా చేశామని.. ఈసారి కూడా అదే చేయాలని చూస్తున్నామని తెలిపాడు. మేము చివరిసారిగా భారత్తో ఆడినప్పుడు కొన్ని తప్పులు చేశాము. యూఏఈపై ఆడిన జట్టునే ఈ మ్యాచ్ లో ఆడిస్తున్నట్లు నిజాకత్ ఖాన్ తెలిపాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నామన్నాడు. పిచ్ పై గడ్డి బాగా కప్పబడి ఉంది. మంచి స్కోరును సాధించాలంటే మేము బాగా బ్యాటింగ్ చేయాలి. మేము మా బేసిక్స్ ను సరి చేసుకుని ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. జట్టులో ఒక మార్పు మాత్రం ఉంది. హార్దిక్ మాకు ఎంత ముఖ్యమో భావించి.. ఈ మ్యాచ్ కు విశ్రాంతి ఇస్తున్నాం. జట్టులోకి రిషబ్ పంత్ వచ్చాడని రోహిత్ వెల్లడించాడు.
హాంకాంగ్ (ప్లేయింగ్ XI): నిజాకత్ ఖాన్ (సి), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, స్కాట్ మెక్ కెచ్నీ(w), జీషన్ అలీ, హరూన్ అర్షద్, ఎహ్సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ గజన్ఫర్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్(w), భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
News Summary - India vs Hong Kong 4th Match Group A Live Cricket Score
Next Story