Mon Dec 23 2024 05:55:33 GMT+0000 (Coordinated Universal Time)
IND vs PAK హెడ్ టు హెడ్ రికార్డ్స్
భారతదేశం, పాకిస్థాన్ T20 మ్యాచ్ లలో తొమ్మిది సార్లు తలపడ్డాయి.
ఆసియా కప్ 2022 మ్యాచ్ 2 లో భాగంగా.. ఆగస్టు 28న ఆదివారం నాడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ప్రారంభం కానుంది. దుబాయ్‌లో జరగబోయే బ్లాక్‌బస్టర్ మ్యాచ్ కు అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. టీవీలకు ప్రజలు అతుక్కుపోతున్నారు. గతంలో భారత్ ఏడుసార్లు ఆసియా కప్ టోర్నీని గెలుచుకోగా.. పాకిస్థాన్ రెండుసార్లు విజేతగా నిలిచింది. ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో టీ20 సిరీస్ విజయాలతో భారత్ ఈ టోర్నీలోకి అడుగుపెట్టింది. 2022లో ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే పాకిస్థాన్ ఆడింది.
IND vs PAK హెడ్ టు హెడ్:
భారతదేశం, పాకిస్థాన్ T20 మ్యాచ్ లలో తొమ్మిది సార్లు తలపడ్డాయి. మెన్ ఇన్ బ్లూ 7-2తో హెడ్-టు-హెడ్ రికార్డ్‌లో ముందుంది. ఇరు దేశాల మధ్య మొదటి మ్యాచ్ 2007 T20 ప్రపంచ కప్‌లో జరిగింది, ఇందులో బౌల్ అవుట్ ద్వారా భారత్ గెలిచింది. ఇరు దేశాలు చివరిసారి అక్టోబర్ 2021లో జరిగింది. ఇందులో పాక్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ రెండు జట్లు ఆసియా కప్‌లో 14 సార్లు తలపడ్డాయి, భారత్ 8-5తో అత్యుత్తమ రికార్డును కలిగి ఉంది.
టాప్ పెర్ఫార్మెన్స్:
భారత్-పాక్ మ్యాచ్ లలో విరాట్ కోహ్లి ఏడు మ్యాచ్‌లలో 77.75 సగటుతో 311 పరుగులతో T20Iలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో కూడా కోహ్లీ అర్ధశతకం సాధించాడు. బౌలింగ్ విభాగంలో, ఉమర్ గుల్ టాప్ లో ఉన్నాడు. ఆరు గేమ్‌లలో 16.18 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు.
ఆసియా కప్ 2022 లో భాగంగా మ్యాచ్ నం.2 భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News Summary - India vs Pakistan Head to Head Stats in T20Is
Next Story