Thu Dec 26 2024 17:53:10 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన శ్రీలంక.. తొలుత ఇండియా బ్యాటింగ్
ఆసియా కప్ లో శ్రీలంకతో ఇండియా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ లో శ్రీలంకతో ఇండియా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత ఇండియా బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్ భారత్ కు చావో రేవో అన్న రీతిలో బరిలోకి దిగనుంది. సూపర్ 4లో శ్రీలంక ఇప్పటికే ఒక మ్యాచ్ విజయం సాధించింది. భారత్ మాత్రం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది.
గెలిచి తీరాల్సిన పరిస్థితి....
దీంతో ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి తీరాల్సిన పరిస్థితి. భారత్ రానున్న రెండు మ్యాచ్ లు గెలిస్తేనే ఆసియా కప్ లో ఫైనల్ కు చేరుకుంటుంది. భారత్ లో స్వల్ప మార్పులు చేసే అవకాశముంది. రిషబ్ పంత్ స్థానంలో దినేష్ కార్తీక్ చోటు కల్పించనున్నారని చెబుతున్నారు. అక్షర్పటేల్ కు కూడా స్థానం కల్పించే అవకాశాలున్నాయి.
Next Story