Sat Nov 23 2024 01:49:02 GMT+0000 (Coordinated Universal Time)
పంత్ ఆడనందుకు ఆ హీరోయిన్ ఫుల్ ఖుషీ అంటున్నారే..!
రిషబ్-ఊర్వశీ మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై ఎటువంటి క్లారిటీ లేకపోయినా
ఆసియా కప్-2022 లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. స్టేడియం హౌస్ ఫుల్ అయింది. మ్యాచ్ ను వీక్షించడానికి పలువురు సెలెబ్రిటీలు కూడా వచ్చారు. వారిలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా ఉన్నారు. కొద్దిరోజుల కిందట ఊర్వశి రౌతేలాకు.. భారత క్రికెటర్ రిషబ్ పంత్ తో సోషల్ మీడియాలో గొడవ అయిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ లో మొదటి మ్యాచ్ లో పంత్ ను కూర్చోబెట్టడంతో పలువురు మీమ్స్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పంత్ ను పక్కన పెట్టినందుకు అభిమానులు బాధ పడుతున్నా.. ఆ హీరోయిన్ మాత్రం ఎంతో ఆనందంగా ఉండి ఉంటుందంటూ స్టేటస్ ను పెట్టారు.
రిషబ్-ఊర్వశీ మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై ఎటువంటి క్లారిటీ లేకపోయినా.. ఇటీవల ఇంటర్వ్యూలో ఊర్వశీ 'ఆర్పీ' తన ఇంటికి వచ్చి లాబీలో గంటలకొద్ది వేచి చూశాడని చెప్పింది. అతడిని కలవాలని అనుకున్నా.. బాగా అలసిపోవడంతో నిద్రపోయానని చెప్పుకొచ్చింది. లేచి చూసే సరికి ఆర్పీ నుంచి 16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. ఆర్పీ ఎవరు అని యాంకర్ ప్రశ్నిస్తే.. ఊర్వశీ మాత్రం వివరణ ఇవ్వలేదు. ఇక రిషబ్ పంత్ ఊర్వశీ పేరును ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చాడు. వార్తల్లో నిలవడం కోసం ఇంటర్వ్యూల్లో అబద్ధాలను చెప్పే వాళ్లను చూస్తే నవ్వొస్తోందన్నాడు. పేరు, ప్రఖ్యాతుల కోసం వాళ్లు ఇలా దిగజారడం బాధపడాల్సిన అవసరం అని చెప్పుకొచ్చాడు. 'నా వెంట పడకు అక్కా.. అబద్ధాలకు కూడా హద్దులు ఉంటాయి' "merapichachorhoBehen #Jhutkibhilimithotihai అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రిషబ్ పంత్ తన పోస్ట్ ను డిలీట్ చేశాడు. ఊర్వశి రౌతేలా మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 'చోటు భయ్యా బ్యాట్ బాల్ తో ఆడుకోవాలి. నీలాంటి పిల్లాడి విషయంలో నేనేమీ మున్నీని కాదు.. చెడ్డ పేరు తెచ్చుకోడానికి.. రక్షా బంధన్ శుభాకాంక్షలు ఆర్పీ చోటు భయ్యా' అని పోస్టు పెట్టింది. ఇలా వారిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా వివాదం నడిచింది.
ఇక ఆసియా కప్ లో భారత్ మొదటి మ్యాచ్ లో రిషబ్ పంత్ ను ఆడనివ్వకపోవడం ఊర్వశీకి ఎంతో ఆనందం తెచ్చి ఉంటుందని చెప్పుకొచ్చారు సోషల్ మీడియా యూజర్లు. వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ను భారత జట్టులో తీసుకోగా.. పంత్ ను పక్కన పెట్టడం భారత అభిమానులను కలవరపరిచింది. తర్వాతి మ్యాచ్ లో కెఎల్ రాహుల్ ను పక్కన పెట్టి పంత్ ను ఆడిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
Next Story