Mon Dec 23 2024 02:15:19 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడకుండా కోహ్లీ చాలా తప్పు చేశాడు
అంతర్జాతీయ మ్యాచ్‌లను దాటవేయడం కోహ్లి తీసుకున్న తప్పుడు నిర్ణయమని, అతను అంతర్జాతీయ మ్యాచ్ లలో ఆడి ఉంటే
విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో పేలవమైన ఫామ్ తో కష్టపడుతూ ఉన్నాడు. అయితే ఎక్కువగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో విరామం తీసుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌కు ముందు చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ ఆడలేదు. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు ఆటగాడు డానిష్ కనేరియా విరాట్ కోహ్లీ చర్యను విమర్శించాడు. విరాట్ కోహ్లీ కొన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ లను ఆడకుండా ఉండి ఉంటే బెటర్ అని చెప్పుకొచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 తర్వాత, కోహ్లి భారతదేశం తరపున ఇంగ్లండ్ పర్యటనలో మాత్రమే ఆడాడు. 6 ఇన్నింగ్స్‌లలో.. కోహ్లీ అత్యధిక స్కోరు 20 మాత్రమే. కోహ్లి ఇప్పుడు ఆగస్ట్ 27 నుండి UAEలో జరగనున్న ఆసియా కప్ 2022లో ఆడనున్నాడు.
ఇండియా టుడేతో కనేరియా మాట్లాడుతూ.. అంతర్జాతీయ మ్యాచ్‌లను దాటవేయడం కోహ్లి తీసుకున్న తప్పుడు నిర్ణయమని, అతను అంతర్జాతీయ మ్యాచ్ లలో ఆడి ఉంటే అతను ఫామ్‌కి తిరిగి రావడానికి సహాయపడి ఉండేదని అన్నాడు. "విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి కష్టపడుతున్నాడు. మూడు సంవత్సరాలుగా విఫలమవుతూ ఉన్నాడు. 2021 T20 ప్రపంచకప్ తర్వాత, అతను తన కెప్టెన్సీని (ODIలలో) కోల్పోయాడు, ఆపై బోర్డుతో సమస్యలు ఉన్నాయంటూ ప్రకటనలు మీడియాలో వచ్చాయి. అతడు బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని.. మరికొన్ని సంవత్సరాలు ఆడాలనుకుంటే అతను మంచి ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను." అని చెప్పాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20లు కోహ్లీకి కీలకమైనవి భావించాం.. ఆ సిరీస్‌లో కోహ్లీ ఆడి ఉండి ఉంటే బాగున్ను అని కనేరియా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
"మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం అతని ప్రదర్శన (ఆసియా కప్‌లో)పై ప్రభావం చూపుతుంది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత అతను ఆడలేదు. అతను తన ఫామ్‌ను తిరిగి పొందడానికి ఇంగ్లాండ్‌లో దేశవాళీ క్రికెట్లో ఆడి ఉండవచ్చు. ఇప్పుడు తాజాగా ఆసియా కప్‌కు రానున్నాడు. అక్కడి నుంచి రాణిస్తాడో లేదో చూడాలి. ఇది అతనికి పెద్ద ఒత్తిడితో కూడిన గేమ్. కోహ్లీ వచ్చి భారీగా పరుగులు చేస్తాడని నేను ఆశిస్తున్నాను. " అని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.
News Summary - Virat Kohli Has Done Wrong By Missing International Matches
Next Story